Friday, July 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ కంఠాలిలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం

 కంఠాలిలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని కంఠాలి గ్రామంలో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం విజయవంతమైందని జుక్కల్ ప్రభుత్వాస్పత్రి వైద్యుడు విట్టల్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణ, పరిశుభ్రత, తాగునీటి వినియోగం, దోమల నివారణ, వ్యక్తిగత ఆరోగ్యంపై గ్రామ ప్రజలకు వైద్యులు అవగాహన కల్పించారు. అలాగే ఈ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైద్యులు, నర్సులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -