Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సత్యాగ్రహ దీక్షలో ఉప్పునుంతల యూత్ కాంగ్రెస్ నాయకులు

సత్యాగ్రహ దీక్షలో ఉప్పునుంతల యూత్ కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరుకు నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్ష కార్యక్రమంలో ఉప్పునుంతల మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాత్లావత్ కృష్ణ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేడమెని భాస్కర్, ఉపాధ్యక్షుడు మండలి శివ, ప్రధాన కార్యదర్శి గుండెమోని శ్రీశైలం తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వానికి మద్దతుగా చేపట్టిన ఈ సత్యాగ్రహ దీక్షలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -