నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలోని పర్భానీ జిల్లా యశ్వాడి గ్రామంలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. హనుమాన్ ఆలయంలో నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పు భాగం ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు మరణించారు. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పు, దానికి ఆసరాగా ఉన్న ఒక పిల్లర్, గోవా కర్రలు ఒక్కసారిగా కుప్పకూలి కింద ఉన్న భక్తులపై పడ్డాయి. ఈ హఠాత్పరిణామంతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం, భయాందోళనలు రేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో కనీసం 8 నుంచి 10 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, ఆలయ సిబ్బంది గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
హనుమాన్ ఆలయంలో కూలిన మండపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



