Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాజ్ పూర్ లో ఏసీఎఫ్ ప్రత్యేక హెల్త్ క్యాంప్

తాజ్ పూర్ లో ఏసీఎఫ్ ప్రత్యేక హెల్త్ క్యాంప్

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపడుతున్న యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ కార్యక్రమం కింద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇటీవల డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ గ తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ లో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నోడల్ అధికారి డిటిసిఓ డాక్టర్ వంశీకృష్ణ హాజరై గ్రామ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. క్యాంప్‌లో భాగంగా గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్యంగా క్షయ, జ్వరాలు, రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించడమే ఈ ఏసీఎఫ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించిన వైద్య బృందానికి మరియు సహకరించిన గ్రామ పంచాయతీ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ప్రతి నెల లేదా రెండు నెలలకొకసారి ఇటువంటి హెల్త్ క్యాంపులు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందిని కోరారు.  ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గ్రామ స్థాయిలో ముందస్తు పరీక్షలు పెంచితే అనేక రోగాలను ప్రారంభ దశలోనే నియంత్రించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రభుత్వ వైద్య బృందం, ఆరోగ్య కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -