నవతెలంగాణ-హైదరాబాద్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ పదే పదే ఉల్లంఘిస్తూ లెబనాన్‌పై వరుసగా దాడులు చేస్తోంది. శనివారం కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు మరణించారు. వరుస దాడులను మరోసారి ఇరాన్ ఖండించించింది. ఈ దాడులను వ్యతిరేకిస్తూ ఇప్పటికే స్విట్జర్లాండ్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
“హోర్ముజ్ జలసంధిని నౌకా రవాణాకు మూసివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాము, శత్రువు ఇచ్చిన మాటను ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా ఈ మొదటి చర్య తీసుకున్నామని, దురాక్రమణ కొనసాగితే, శత్రువు తన బాధ్యతలను పాటించేలా ఒత్తిడి చేయడానికి మరిన్ని చర్యలు తీసుకోబడతాయని” అని ఖతమ్-అల్ అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయం ప్రభుత్వ టీవీలో ప్రసారం చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు త్వరలో రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వెల్లడించారు.”రాబోయే రెండు రోజుల్లో ఎప్పుడైనా నేను(స్విట్జర్లాండ్) బయలుదేరతానని భావిస్తున్నాను, కానీ ఇది సున్నితమైన సమన్వయంతో కూడిన వ్యవహారం అని మీకు తెలుసు కదా,” అని వాన్స్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.



