Monday, June 22, 2026
E-PAPER
Homeజాతీయంఅన్నా డీఎంకే ఎమ్మెల్యేలు వాకౌట్

అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు వాకౌట్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. అన్నా డీఎంకే కజగం(AIADMK) ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేశారు. జీరో ఆవర్ సమయంలో తమను ప్రజా సమస్యలపై మాట్లాడానికి అవకాశం ఇవ్వట్లేదని వాపోయారు. టీవీకే వైఖరిని ఖండిస్తూ తమ అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కల్పించలేదు. “ఈ రోజు జీరో అవర్‌లో స్పీకర్ మాకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు, అందుకే మేము సభ నుండి వాకౌట్ చేశాము. అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించాలని మేము స్పీకర్‌ను కోరాము, కానీ మాకు ఆ అవకాశం నిరాకరించారు” అనిఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి పేర్కొన్నారు. అదే విధంగా తిరువళ్లూరు అమ్మోనియా గ్యాస్ లీకేజీ ఘటనపై సమగ్ర చర్చ జరపాలని, భద్రతా లోపంపై బాధ్యతను నిర్ధారించి పూర్తి స్థాయి నివేదికను అందించాలని డీఎంకే , కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఎమ్మెల్యేలు కూడా స్పీకర్‌ను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -