నవతెలంగాణ – మద్నూర్
ప్రజా సమస్యలు తీర్చడంలో మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అభినందించారు. మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీలో నీటి ఎద్దడి నివారణ కోసం ఈపాటికే పది చోట్ల త్రాగునీటి సమస్య తీర్చడానికి బోర్లు వేయించగా మరొక వాడలో నీటి ఎద్దడి ఉన్న దానికి నివారణ చర్యలు చేపట్టడం రాత్రికి రాత్రి బోరు వేయించడానికి కృషి చేయడం సర్పంచ్ పనితీరు పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తపరుస్తూ అభినందించారు. గురువారం రాత్రి మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎరుకల గల్లీలో నీటి ఎద్దడి నివారణ కోసం ఎమ్మెల్యే చేత బోరు మోటార్ కు పూజ చేయించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ పనితీరు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గల్లి ప్రజలు పాల్గొన్నారు.
సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి పనితీరును అభినందించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



