Friday, February 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలు650కి పైగా థియేటర్లలో..

650కి పైగా థియేటర్లలో..

- Advertisement -

బన్నీవాస్‌, వంశీ నందిపాటి నిర్మాతల ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై ‘హే బల్‌వంత్‌’ అనే చిత్రాన్ని నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ,’650 పైగా స్క్రీన్లలో మా సినిమాను రిలీజ్‌ చేయబోతున్నాం. ఇది మా కాన్ఫిడెన్స్‌కి నిదర్శనం. నేడు రిలీజ్‌ అవుతుండగా.. గురువారం సాయంత్రం నుంచే చాలా చోట్ల పెయిడ్‌ ప్రీమియర్లను స్టార్ట్‌ చేశాం. అందరూ వచ్చి హాయిగా నవ్వుకుని వెళ్లండి. మేం కచ్చితంగా హిట్టు కొట్టబోతున్నాం’ అని అన్నారు. ‘ఇది నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ రిలీజ్‌, బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అని అనుకోవచ్చు. మా మూవీని ఈ రేంజ్‌కు తీసుకు వచ్చిన వంశీకి థ్యాంక్స్‌. ‘హే బల్‌వంత్‌’ అనేది సుహాస్‌ 2.ఓ’ అని హీరో సుహాస్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -