- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో H-CITI ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల రోడ్లలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వన్-వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో వాహనదారుల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక మళ్లింపు మార్గాలను సూచించారు. సైన్‌బోర్డుల ఆధారంగా వాహనదారులు లేన్‌లను మార్చుకోవాలని, నిర్దేశిత ఎగ్జిట్ పాయింట్లను గమనించాలని సూచించారు. రద్దీని తగ్గించడానికి ప్రజా రవాణా, కార్ పూలింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు.
- Advertisement -



