Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెండ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్తూ తండ్రి మృతి

పెండ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్తూ తండ్రి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వనపర్తి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఐదు రోజుల్లో కుమారుడి వివాహం ఉండగా, పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కుటుంబ పెద్ద వెంకటయ్య (48) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం రాత్రి కొత్తకోట మండలం మిరాసిపల్లి నుంచి పెబ్బేరు వెళ్లేందుకు జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా, కర్నూలు వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -