Sunday, June 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభార్యను కట్టేసి..బలవంతంగా మూత్రం తాగించిన భర్త

భార్యను కట్టేసి..బలవంతంగా మూత్రం తాగించిన భర్త

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఒక ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న జితేంద్ర ఘసియా (44) తన భార్య తారాబాయి చేతులు, కాళ్లు కట్టేసి, జుట్టు కత్తిరించి గుండు గీసి, ముఖానికి ఇంజన్ ఆయిల్, బొగ్గు పూసి తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా, నలుగురు పిల్లలు చూస్తుండగానే ఆమెతో బలవంతంగా మూత్రం తాగించాడు. జూన్ 14న జరిగిన ఈ ఘోర కృత్యానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు నిందితుడైన ప్రభుత్వ డ్రైవర్‌ను జూన్ 18న అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. వీరిద్దరూ 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఏడాది కాలంగా భర్త వేధింపులు, కుటుంబ కలహాల కారణంగా తారాబాయి తన నలుగురు పిల్లలతో కలిసి భర్తకు దూరంగా విడిగా నివసిస్తోంది. బతుకుదెరువు కోసం ఇళ్లల్లో పనిమనిషిగా చేరి జీవనం సాగిస్తోంది. జూన్ 14న ఆమె పట్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కోన పాండోపరా గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లగా, నిందితుడు జితేంద్ర అక్కడకు వెతుక్కుంటూ వచ్చాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతోనే తాను ఈ దాడికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించడమే కాకుండా, ఆ దృశ్యాలను తనే స్వయంగా ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే భర్త చేసిన ఆరోపణలను బాధితురాలు పూర్తిగా ఖండించింది. ఈ అమానవీయ ఘటనపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -