- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం జిల్లా గాంధీనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ల వేదకుమార్, ఐదేళ్ల తనీష్ అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -


