యశ్ తాజాగా నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రివీల్ చేస్తూ ఆగస్ట్ 26న సినిమాని రిలీజ్ చేయబోతోన్నట్టుగా తెలిపారు. ఇక ఈ పోస్టర్‌ను గమనిస్తే యశ్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. వరమహాలక్ష్మి, ఓనం, ఈద్, రక్షాబంధన్ వంటి పండుగలతో పాటు లాంగ్ వీకెండ్, సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాలని టీం ఫిక్స్ అయింది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్, రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో రానున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ స్వీయ బ్యానర్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. కన్నడ, ఆంగ్ల భాషలలో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ సినిమాను కన్నడ, హిందీ, ఆంగ్లం, తెలుగు, తమిళం, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితరులు అద్భుతమైన పాత్రల్ని పోషించారు.
‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



