- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామం నుండి పూస వేర్లపల్లె వరకు తారు రోడ్డు పనులను శుక్రవారం గ్రామ సర్పంచ్ బంక లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణానికి రూ .2 కోట్ల 53 లక్షల నిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నిధుల మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొలు రాజు, వార్డ్ మెంబర్ బోంగోని రేణుక, రమేష్ ,కొంగరి స్వరూప తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



