నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ని ఇరాన్ తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ చమురు మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సోమవారం ఉదయం ఆరంభమైన ఆసియా మార్కెట్ ట్రేడింగ్లో ముడిచమురు ధరలు నింగిని తాకాయి. అంతర్జాతీయ బెంచ్మార్క్ అయిన ‘బ్రెంట్ క్రూడ్’ ఫ్యూచర్స్ సుమారు 1.24 శాతం మేర పెరిగి బ్యారెల్కు 81.04 డాలర్ల (గరిష్టంగా82.30 డాలర్లు)కు చేరుకోగా, అమెరికాకు చెందిన డబ్ల్యూటీఐ క్రూడ్ ఏకంగా 2.53 శాతం పెరిగి 77.77 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న స్విట్జర్లాండ్ శాంతి చర్చల ప్రక్రియపై ఈ పరిణామం తీవ్రమైన అనిశ్చితిని, నీలినీడలను కమ్మేలా చేసింది.
మళ్లీ ఎగబాకిన చమురు ధరలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



