Monday, June 22, 2026
E-PAPER
Homeజాతీయంప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఆగిన పెండ్లి

ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఆగిన పెండ్లి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో, 15 ఏళ్ల బాలిక వివాహానికి సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ షూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి, మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్నారు. ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌ను పరిగణనలోకి తీసుకుని, బాలిక చేతిపై గోరింటాకు తప్ప వివాహం జరిగినట్లు ఆధారాలు లేవని నిర్ధారించుకున్న అధికారులు పెళ్లిని నిలిపివేశారు. మైనర్ బాలికను సంరక్షణలోకి తీసుకుని, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -