నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన సామూహిక మరుగుదల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, సర్పంచ్ కంపదండి అశోక్ లతో కలిసి సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిని ఆయన పరిశీలించారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు. నాణ్యతలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా పనులు పూర్తి చేయించాలన్నారు.కార్యక్రమంలో ఈజిఎస్ టెక్నికల్ అసిస్టెంట్ మంజురాణి, తదితరులు పాల్గొన్నారు.
సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



