నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ ప్రధాన లక్ష్యం అని శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. శివసేన పార్టీలో ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఠాక్రేకి ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి అయిన ఏక్‌నాథ్ షిండే చేపట్టిన ‘ఆపరేషన్ టైగర్ ’లో భాగంగా శివసేన (యుబిటి)కి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే (శివసేన) వర్గంలోకి మారబోతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో షిండేకి మద్దతు ఇస్తున్న బీజేపీపై ఆదిత్య ఠాక్రే ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నవారు.. మా ఎంపీలు, ఎమ్మెల్యేలను తమైవపుకు తిప్పుకుంటున్నారు. 2024లో ఓటర్లు వారిని అడ్డుకోవడంతో వారికి కేవలం 240 మంది ఎంపీలు మాత్రమే లభించారు. కానీ ఇప్పుడు వారు పార్టీలను చీల్చడం ద్వారా మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చడమే వారి ప్రధాన లక్ష్యం’ అని ఆయన అన్నారు.
రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ ప్రధాన లక్ష్యం: ఆదిత్య ఠాక్రే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



