- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యూపీ రాజధాని లఖ్‌నవూ అలీగంజ్‌లోని కోచింగ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. మంటల నుంచి తప్పించుకునేందుకు అభ్యర్థులు భవనం పైనుంచి దూకడంతో పలువురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ చేరుకుని పరిశీలించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
- Advertisement -



