Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బదిలీపై వెళ్లిన, కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు సన్మానం 

బదిలీపై వెళ్లిన, కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ-నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండలంలో బదిలీపై ఇతర మండలాలకు వెళ్లిన పంచాయతీ కార్యదర్శులకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ, కొత్తగా విధుల్లో చేరిన కార్యదర్శులకు స్వాగత సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని మిర్జాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్త్య రవి, నసురుల్లాబాద్ పంచాయతీ కార్యదర్శి ఏం. రాజేష్, బస్వాయిపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్. సాయిలు బదిలీపై ఇతర మండలాలకు వెళ్లగా, వారి స్థానాల్లో నసురుల్లాబాద్‌కు మోహన్, మిర్జాపూర్‌కు సాయికృష్ణ, బస్వాయిపల్లికి అనిలా బదిలీపై వచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీడీఓ రవి ఈశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి వారిని సన్మానించారు. ఇక్కడ విధులు నిర్వహించిన కాలంలో గ్రామాల అభివృద్ధికి, ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ బదిలీపై వెళ్లిన కార్యదర్శులను అధికారులు, సిబ్బంది అభినందించారు. అలాగే కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సూర్యకాంత్, సూపరింటెండెంట్ విఠల్, ఏపీఓ సౌజన్య, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -