- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కృషితో నియోజకవర్గంలోనే ఊరురా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మద్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దరాస్ సాయిలు అన్నారు. సోమవారం కొడచర గ్రామంలో ఇందిరమ్మ నూతన ఇంటిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సంతోష్ పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు, హనుమంత్ యాదవ్, మద్నూర్ టౌన్ అధ్యక్షుడు బండి గోపి, వార్డు సభ్యులు గంగాధర్ బండి వార్ దత్తు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



