- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మేనూరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని వాడవాడలో పేరుకుపోయిన గడ్డి, అపరిశుభ్రతను బుధవారం ఆ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, ఉప సర్పంచ్ మల్లయ్య, కార్యదర్శి హరీష్ కుమార్ సంయుక్తంగా పరిశీలించారు. ఈ క్రమంలో వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా పారిశుద్ధ్య కార్మికులతో గడ్డిమందు పిచికారి చేయించారు. ముందుచూపుతో పాలకవర్గం చేపట్టిన పనులపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



