- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఎగువనున్న మహారాష్ట్ర నుండి లేండి వాగుకు వచ్చే వరదతో గోజేగావ్ గ్రామస్తులు అప్రమత్తుగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన లేండి వాగును సందర్శించి, ఉధృతంగా పారుతున్న వరదను పరిశీలించి, పై వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు ఎక్కువగా కురిస్తే.. నీళ్లు ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అత్యవసర పరిస్థితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. కార్యక్రమంలో గోజేగావ్ గ్రామ సర్పంచ్ భారత్ రాథోడ్, ఉప సర్పంచ్ బస్వంత్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ రాథోడ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



