- Advertisement -
- త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం: ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు పరిధిలోని హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి అధికారికంగా ప్రభుత్వం నుండి అనుమతి రావడంతో ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు సోమవారం పూర్తిస్థాయిలో స్మశాన వాటికను సర్వే చేసి పరిశీలించారు. స్మశాన వాటికలో ఉన్న మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అవసరాలు, చేపట్టాల్సిన పనులపై సభ్యులు క్షుణ్ణంగా పరిశీలన నిర్వహించారు. - ఈ సందర్భంగా ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధికి సంబంధించిన పూర్తి నివేదికను త్వరలో సిద్ధం చేసి, అవసరమైన పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్మశాన వాటికలో పారిశుద్ధ్యం, రహదారులు, నీటి సౌకర్యం, విద్యుత్ సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎస్సార్ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, మట్ట శ్రీనివాస్, వెంకట్ గౌడ్, కప్పిర రవీందర్ రెడ్డి, అశోక్ గౌడ్, పాల్గొన్నారు.
- Advertisement -



