Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్న నవతెలంగాణ

ప్రజా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్న నవతెలంగాణ

- Advertisement -
  • విద్యారంగ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్
    నవతెలంగాణ – కామారెడ్డి
  • ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో నవతెలంగాణ దినపత్రిక కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ అన్నారు. సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నవతెలంగాణ పత్రిక ప్రచురించిన విద్యారంగ ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని వివిధ వర్గాల సమస్యలను నిష్పక్షపాతంగా ప్రతిబింబిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా నవతెలంగాణ కథనాలను ప్రచురిస్తోందని పేర్కొన్నారు.
  • విద్యారంగంతో పాటు కార్మికులు, ఉద్యోగులు, రైతులు తదితర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు ప్రచురించడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మీడియా వేదికగా నిలుస్తూ సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న నవతెలంగాణ కృషి ప్రశంసనీయమని అన్నారు. ప్రజా ప్రయోజనాలు, సంక్షేమం, అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ వార్తలను అందించడం ద్వారా పత్రిక ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ కామారెడ్డి విలేఖరి డాకూరి మోహన్, కామారెడ్డి డివిజన్ ఇంచార్జ్ మేతుకు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -