Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్‌కు ఘన వీడ్కోలు

జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్‌కు ఘన వీడ్కోలు

- Advertisement -

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి చైర్మన్‌గా, ప్రధాన జిల్లా, సెషన్స్ న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన డా. సీహెచ్.వి.ఆర్.ఆర్. వరప్రసాద్ సాధారణ బదిలీపై హైదరాబాద్ వక్ఫ్ ట్రిబ్యునల్, వక్ఫ్ బోర్డుకు బదిలీ అయిన సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయనకు ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి ప్రధాన జిల్లా న్యాయమూర్తి డా. వరప్రసాద్ ని శాలువాతో సన్మానించి, వారి సేవలను కొనియాడారు.

  • కామారెడ్డి జిల్లాలో న్యాయ సేవల విస్తరణ, లోక్ అదాలత్‌ల సమర్థ నిర్వహణ, న్యాయ అవగాహన కార్యక్రమాల విజయవంతమైన అమలులో ఆయన అందించిన విశిష్ట సేవలను ప్రశంసించారు. అనంతరం డా. వరప్రసాద్ మాట్లాడుతూ తన పదవీకాలంలో సహకరించిన న్యాయాధికారులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానంలో పి. ముక్తిదా ప్రధాన జిల్లా, సెషన్స్ న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ వి. చంద్రసేన్ రెడ్డి, జూనియర్ సహాయకుడు ఖాన్, టైపిస్ట్‌లు శ్రావణ్, సంధ్య, ఎల్ఏడీసీఎస్ సిబ్బంది, కార్యాలయ సహాయకుడు సాయి ప్రణీత్, ఉదయ జ్ఞాని, దత్తాంశ నమోదు నిర్వాహకుడు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -