- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని 27 మంది విద్యార్థినిలకు బుధవారం హెచ్ పీవీ వ్యాక్సినేషన్లు వేసినట్టు డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శ్రీలేఖ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వ్యాక్సినేషన్ల వల్ల బాలికలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పారు. మండల పరిధలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యార్థినీలు తప్పకుండా ఈ వ్యాక్సినేషన్లు వేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పాఠశాల బాలికలు పాల్గొన్నారు.
- Advertisement -



