Monday, June 22, 2026
E-PAPER
Homeజాతీయంకోచింగ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం..వీడియో

కోచింగ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం ఒక కోచింగ్ సెంటర్ ఉన్న భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఒక గ్రంథాలయం ,కంప్యూటర్ శిక్షణా సంస్థ ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి హుటహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి శ్రమిస్తున్నారు. అయితే మంటల్లో చిక్కుకున్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరికొందరు ప్రమాదం నుంచి బయటపడ్డానికి బిల్డింగ్ పై నుంచి దూకారు. దీంతో వారికి తీవ్రంగా గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సింది.

“సుమారు 10-12 మంది లోపల చిక్కుకుపోయారని, మంటలు తీవ్రంగా ఉండటంతో మేము భవనం లోపలికి వెళ్లలేకపోతున్నాము,” అని ఒక అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -