నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా మరో 20మంది మరణించారు. సోమవారం నాడు కూలీలతో వెళ్తున్న ఒక పికప్ వాహనం ట్రక్కును ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం బెతుల్-చింద్వారా రహదారిపై ఉన్న టెమ్నీ ఖుర్ద్ గ్రామం సమీపంలో జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన 20 మంది బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని నాగ్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున, ఇతర గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



