- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు రెబల్ ఎంపీలు భారీ షాకిచ్చారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. శివసేనలో చేరిన ఎంపీలలో సంజయ్ హరిభావు జాధవ్, భౌసాహెబ్ రాజారామ్ వాఖ్చౌరే, ఓంప్రకాశ్ భూపాల్సింగ్ నింబాల్కర్, సంజయ్ దినా పాటిల్, సంజయ్ ఉత్తమ్రావు దేశ్ముఖ్, నాగేశ్ బాపురావు పాటిల్ అష్టికర్ ఉన్నారు. వీరిలో నింబాల్కర్, అష్టికర్ ఇప్పటికే ఆదివారం షిండే వర్గంలో చేరనున్నట్లు ప్రకటించారు.
- Advertisement -



