నవతెలంగాణ – తుంగతుర్తి
ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం క్లస్టర్ ఏఈఓ సాయి శ్రీజన రైతులకు సూచించారు. శుక్రవారం అన్నారం గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 12 అంకెల నంబర్ వస్తుందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అందించనున్న ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులకు చేరుతాయన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రైతులు పట్టాదారు పాసుబుక్, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను క్లస్టర్ల వారీగా ఉన్న ఏఈవోలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్, జిపిఓ సంజీవ, ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు మరికంటి శ్యామ్, పరాల ఉమ, కడారి సుకన్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఏఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



