నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలకేంద్రం లోని జీడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల పీఎం శ్రీ ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా ఎంపిక కావడం జరిగింది. అందులో భాగంగా మండల విద్యాధికారి తరి రాము ఆహ్వానమేరకు హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్, స్థానిక హెడ్ కాన్స్టేబుల్ ఇద్దయ్య శుక్రవారం విద్యార్థులకి పోక్సో చట్టంపైన అవగాహనా సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా హైకోర్టు న్యాయవాది అనిల్ కుమార్ విద్యార్థులకి చట్టం అంటే ఏమిటి? వివిధ చట్టాలు వాటి అవశ్యకత, బాలికలు రక్షణ కొరకు పొందుపరిచిన చట్టాల గురించి వివరించారు.
ముఖ్యంగా పోక్సో చట్టం అవశ్యకత, పోక్సో చట్టం ద్వారా అమలు అవుతున్న శిక్షలు గురించి విద్యార్థులకి రీసెంట్ జడ్జిమెంట్ లతో వివరించారు. అనంతరం మండలం అధికారి తరి రాము మాట్లాడుతూ గత 15 సంవత్సరాలు గా హైకోర్టు న్యాయవాది అనిల్ కుమార్ నియోజకవర్గ పేద విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి, పేద ప్రజలకి చేస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అన్నారు. వీరీ ద్వారా 10 సంవత్సరాల క్రితమే నియోజకవర్గంలోని ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకి మౌలిక సౌకర్యాలు కల్పించడం జరిగిందని గుర్తుచేశారు. అనంతరం ఇవారిని శాలువతో ఘసన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తరి రాము, పాఠశాల ప్రాధానోపాద్యయులు, హోంగార్డ్ సైదులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, నాయకులు కోట అంజి యాదవ్, మన్నెం కోటి, గంగుల లింగస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



