- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, తుమ్మల పర్యటిస్తున్నారు. ఉ.10.30 గం.కు కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం, మంత్రి కిషన్‌రెడ్డి భేటీ కానున్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ అనుమతులపై ఖట్టర్‌తో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో ఉత్తమ్, తుమ్మల భేటీకానున్నారు. ధాన్యం సేకరణపై కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రులు చర్చించనున్నారు.
- Advertisement -


