Monday, August 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాసర మహంకాళి ఆలయంలో చోరీ

బాసర మహంకాళి ఆలయంలో చోరీ

- Advertisement -

– ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
నవతెలంగాణ -ముధోల్ : బాసర లోగల మహంకాళి ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి కెళ్తే… స్థానికుల కధనం ప్రకారం..బాసర జ్ఞాన సరస్వతి ఆలయంకు  అనుబంధ ఆలయమైన మహంకాళి ఆలయం  తాళాలు  పగులగొట్టి గుర్తు తెలియని దొంగలు చోరికి పాల్పడ్డారు. మహంకాళి అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండి ని ఎత్తుకెళ్లారు.   ఆలయ పరిసర ప్రాంతం సమీపంలో ఎత్తుకెళ్లి న  హుండి ని దొంగలు  పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. చోరీ గురైన వెండి  కిరీటం సుమారు కిలో పైగా ఉంటుందని సమాచారం. మంగళవారం ఉదయం అభిషేక పూజకు వచ్చిన ఆలయ పూజారులు గమనించి ఆలయ అధికారులకు సమాచారం అందించారు ‌. దీంతో ఆలయ అధికారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఎఎస్పీ పత్తిపాక సాయి కిరణ్, ముధోల్ సిఐ రవీందర్ నాయక్ లు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు.  పలు వివరాల ను ఆలయ ఈఓ అంజనాదేవి కీ అడిగి తెలుసుకున్నారు. వెంటనే క్లూస్ టీమ్, డాగ్స్ స్క్వాడ్ ను పోలిసులు రంగంలోకి దించారు. వేలిముద్రాలను  సేకరించారు. ఆలయం దగ్గర ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు గుర్తు తేలియని దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -