Tuesday, June 23, 2026
E-PAPER
Homeక్రైమ్వాహనం బోల్తా..ముగ్గురి మృతి

వాహనం బోల్తా..ముగ్గురి మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు – రంగంపేట మధ్య సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పంక్చర్ కావడంతో టాటా ఏస్ వాహనం బోల్తాపడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం మండలం మల్లాం, జల్లూరు గ్రామాలకు చెందిన 11 మంది బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతానికి నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లారు. సోమవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. వడిశలేరు – రంగంపేట మధ్య వీరి వాహనం ప్రమాదానికి గురైంది. 

ఈ ఘటనలో సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సిమెంట్ పలకలు వీరిపై పడటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. క్షతగాత్రులను 108 వాహనాల్లో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను అనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా 30 నుంచి 35 ఏళ్ల వయసు వారే. మరో 30 నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారనగా ప్రమాదం జరగడంతో సహచరులు కన్నీరుమున్నీరయ్యారు. రంగంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -