Tuesday, June 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగుడిమల్కాపూర్‌లో అగ్ని ప్రమాదం..భారీగా మంటలు

గుడిమల్కాపూర్‌లో అగ్ని ప్రమాదం..భారీగా మంటలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వింటేజ్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఓ ఫర్నిచర్ తయారీ కార్ఖానాలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మరో రెండు కార్ఖానాలకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -