Tuesday, June 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్త్వరలో దొంగలను పట్టుకుంటాం : జిల్లా ఎస్పీ జానకి షర్మిల

త్వరలో దొంగలను పట్టుకుంటాం : జిల్లా ఎస్పీ జానకి షర్మిల

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్‌ : బాసర మహంకాళి ఆలయంలో చోరికి పాల్పడిన గుర్తుతెలియని  దొంగలను అతి  త్వరలోనే పట్టుకుంటామని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మహంకాళి ఆలయాన్ని మంగళవారం ఉదయం పరిశీలించారు. పలు వివరాలను ఆలయ ఈవో అంజనీ దేవిని అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. మహంకాళి ఆలయంలో దొంగలు అమ్మవారి వెండి కిరీటం ను   దొంగలించారని తెలిపారు. అలాగే హుండీ ఎత్తుకెళ్లి ఆలయ సమీపంలో వదిలి వెళ్ళారని తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగిందన్నారు.  క్లూస్ టీమ్ ను రంగంలోకి దించామన్నారు.ఈ దొంగతనంపై అన్ని కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరలోనే నిందితులను  పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. ఎస్పీ వెంట వెంట బైంసా ఎఎస్పీ పత్తిపాక సాయికిరణ్, ముధోల్ సిఐ రవీంద్ర నాయక్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -