Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ భారతిపై గ్రామసభ..

భూ భారతిపై గ్రామసభ..

- Advertisement -

ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భూభారతి చట్టం అమలులో భాగంగా మండలంలోని చందుపట్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీవో కృష్ణారెడ్డి హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో రీ సర్వే  కోసం  గ్రామసభ నిర్వహించినట్లు  తెలిపారు. ఈ గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు,  గ్రామకంటం భూములను రీ సర్వే జరిపి ప్రతి భూ కమతమునకు భూధార్ నెంబర్ కేటాయించబడును అందువలన భవిష్యత్ లో సరిహద్దు తగాదాలు రాకుండా నివారించ వచ్చని, అనంతరం జరగబోయే ప్రతీ భూ లావాదేవీకి స్పష్టమైన సబ్ డివిజన్ ఏర్పాటు చేయవచ్చుని, సర్వే నిర్వహించే సమయంలో రైతులందరూ క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తహశీల్దార్ అంజిరెడ్డి,  రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ పాలనాదికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబెర్స్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -