కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గ్రామ పంచాయతీ కార్మికులకు రావలసిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఫిబ్రవరి 23 న కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ , కార్యదర్శి మల్యాల నరసయ్య , మల్లయ్య శ్రీనివాస్, అంజయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి: సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



