Sunday, February 22, 2026
E-PAPER
Homeకరీంనగర్ప్రపంచ పీడిత ప్రజల విముక్తి జెండా కమ్యూనిస్టు మ్యానిఫెస్టో

ప్రపంచ పీడిత ప్రజల విముక్తి జెండా కమ్యూనిస్టు మ్యానిఫెస్టో

- Advertisement -

రెడ్ బుక్ డే సామూహిక పుస్తక పఠనంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు టీ స్కైలాబ్ బాబు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

ప్రపంచ పీడిత జన విముక్తి కోసం కారల్ మార్క్స్ ఎంగేల్స్ లు 1848 ఫిబ్రవరి 21 కమ్యూనిస్టు ప్రణాళిక  అనే ఒక పుస్తకంరచించి విడుదల చేశారని, అది దోపిడీ లేని సమాజాన్ని నిర్మించటానికి ప్రపంచాన్ని  ప్రపంచాన్ని మార్చాలి అనే మహోన్నత ఆశయానికి నాంది పలికిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీ స్కైలాబ్ బాబు అన్నారు. శనివారం సిరిసిల్ల బివై నగర్ అమృతలాల్ శుక్ల భవన్ లో సీపీఐ(ఎం) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే పుస్తకాన్ని  సామూహిక పుస్తక పఠనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. కారల్ మార్క్స్ ఎంగిల్స్ మనకు ఒక సిద్ధాంతాన్ని మాత్రమే ఇవ్వలేదని, ఆ వెలుగులో ఈ ప్రపంచాన్ని మార్చే మార్గాన్ని చూపించారని దోపిడి సమాజం నుంచి దోపిడీ సమాజం నుండి ప్రజలను విముక్తి చేయడానికి అర్థం చేసుకోవడానికి కావలసిన ఒక ఆలోచన పద్ధతిని ఇచ్చారని చెప్పారు.

అదే సమయంలో ప్రపంచాన్ని మార్చాలనే కర్తవ్యాన్ని కూడా ఇచ్చారని సంపద పెరుగుతుందే తప్ప సమానంగా పంచ పడట్లేదని విమర్శించారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుందని, ఫలితంగా కార్పోరేట్ శక్తులు ప్రభుత్వాల కంటే బలంగా మారుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యం మార్కెట్ కు బానిస అవుతుందనీ విమర్శించారు.  అందుకే రెడ్ బుక్ డే అంటే కేవలం ఒక రాజకీయ జ్ఞాపకం చారిత్రక స్మరణ మాత్రమే కాదు అది మానవాళి శ్రేయస్సుకై కమ్యూనిస్టు ప్రణాళిక రూపంలో ఒక శాస్త్రీయ భావజాలం ఆవిర్భవించిన రోజు అన్నారు. కష్టజీవుల రాజ్యం కోసం పరితపించే కార్యకర్తలందరికీ చదువుతోపాటు సమాజాన్ని మార్చడానికి కమ్యూనిస్టు ప్రణాళిక ఒక వజ్రాయుధం లాంటిదని చెప్పారు. రాబోయే కాలంలో బరితగించిన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కార్యకర్తలంతా పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని బెదిరిస్తుందని దోపిడి దొంగల ముఠా లాగా వ్యవహరిస్తుందని వెనిజులా అధ్యక్షుడు మధురో అతని భార్యను భర్త రాత్రి కిడ్నాప్ చేసి నిర్బంధించడం అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని చెప్పారు.

మోడీ మౌనవ్రతం వీడి అమెరికాకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూశం రమేష్ అధ్యక్షత వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, ముక్తికాంత అశోక్, గురిజాల శ్రీధర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, మిట్టపల్లి రాజమల్లు, ఎలిగేటి రాజశేఖర్, నక్క దేవదాస్, సిరిమల్లె సత్యం, ఎం.నర్సయ్య, బి శ్రీనివాస్, అంజయ్య, శ్రీనివాస్ కమలాకర్, రజిత పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -