Sunday, February 22, 2026
E-PAPER
Homeఆటలుఅమ్మాయిల నవ చరిత్ర

అమ్మాయిల నవ చరిత్ర

- Advertisement -

ఆడిలైడ్‌ (ఆస్ట్రేలియా) : భారత అమ్మాయిలు సరికొత్త చరిత్ర సృష్టించారు. 2017 నుంచి సొంతగడ్డపై ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను హర్మన్‌ప్రీత్‌సేన మట్టికరిపించింది. శనివారం ఆడిలైడ్‌లో జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్‌.. 2-1తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆసీస్‌ గడ్డపై టీ20 సిరీస్‌ విజయంతో దశాబ్ది నిరీక్షణకు తెరపడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 176/6 పరుగులు చేసింది. ఆడిలైడ్‌లో మహిళల టీ20లో ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్‌ స్మృతీ మంధాన (82, 55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), జెమీమా రొడ్రిగ్స్‌ (59, 46 బంతుల్లో 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 121 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో ఆసీస్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు.

ఆఖర్లో రిచా ఘోష్‌ (18, 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. రికార్డు ఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 159/9 పరుగులకే పరిమితమైంది. ఆష్లె గార్డ్‌నర్‌ (57, 45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. శ్రేయాంక పాటిల్‌ (3/22) నిప్పులు చెరగటంతో ఆసీస్‌ 32/3తో విలవిల్లాడింది. అరుంధతి రెడ్డి (2/35), శ్రీ చరణి (3/32) వికెట్ల వేటలో మెరవటంతో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత్‌, ఆస్ట్రేలియా అమ్మాయిల వన్డే సిరీస్‌ మంగళవారం బ్రిస్బేన్‌లో షురూ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -