హీరో విశ్వక్‌సేన్ మరోసారి బౌండరీస్‌ని దాటి ఓ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్‌సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో ‘కల్ట్’తో రాబోతున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. భారతీయ సినిమాల్లో తొలి స్లాషర్ జోనర్ చిత్రమిది. వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన, అన్‌కాంప్రమైజింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని మరింత పెంచింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు విశ్వక్‌సేన్ మాట్లాడుతూ,’ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు?, ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను.
అవన్నీ కలిపికొట్టి ఈ సినిమా తీశాను. చాలా కసిగా ఈ సినిమా తీశాను. ఈ టీజర్‌లో మీరు ఏమి చూడలేదు. జస్ట్ చివర్లో ఒక షాట్ పెట్టాను. పిల్లలు, సున్నిత మనస్కులని ఈ సినిమాకి దూరంగా ఉంచండి. అరవింద్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. తారక్ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. గాయత్రి చాలా ప్రొఫెషనల్. తనకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఈ సినిమాకి ఒక కన్ను తరుణ్ భాస్కర్ అయితే మరొక కన్ను రవి బస్రూర్. ఈ సినిమా సౌండ్ చూసుకున్న తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ఆయనకి చిన్న కానుకగా రోలెక్స్ వాచ్‌ని బహుమతిగా ఇస్తున్నాను. ఈ సినిమాలో దాదాపు 100 మంది కొత్త నటీనటులు ఉన్నారు. తరుణ్ భాస్కర్ కెరీర్ ప్రారంభం నుంచి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. కాలేజీల రీ ఓపెనింగ్ టైంకి సినిమాని రిలీజ్ చేస్తార’ అని తెలిపారు.
తొలి తెలుగు స్లాషర్ జోనర్ సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



