రోజంతా ఫ్రెష్‌గా, అందంగా కనిపించాలంటే డైలీ బ్యూటీ రొటీన్‌లో ‘ఫేస్ వాష్’ తప్పనిసరి. ఇందుకు మన వంటిల్లే ఒక అద్భుతమైన బ్యూటీ పార్లర్. ఖరీదైన ఫేస్ వాష్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా, మీ ముఖాన్ని ఇన్‌స్టంట్‌గా గ్లోయింగ్‌గా మార్చే కొన్ని సూపర్ వంటింటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి…
పెరుగు, తేనె మిశ్రమం ఫేస్ ప్యాక్ గా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల పెరుగుకు ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత మళ్లీ ఒకసారి ఈ పేస్టు అప్లై చేసి పది నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఆపిల్ ప్యూరీకి కొంచెం నిమ్మరసం కలిపి, దాంతో ముఖానికి మసాజ్ చేసుకోవాలి. గుడ్డు పచ్చసొన, టీ స్పూన్ తేనె మిశ్రమం కూడా ఫేస్ వాష్ గా పనికొస్తుంది.
పైనాపిల్ ముక్కలను స్మాష్ చేసి, మెత్తని పేస్ట్ తయారు చేయాలి. ఆ పేస్ట్ కు రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపి ఫేస్ కి రాసుకోవాలి. అయిదు నిమిషాలయినంక నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం ఫ్రెష్ గా కనిపిస్తుంది.
ఈ సమస్యలకు..చెక్ పెట్టాలంటే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



