నవతెలంగాణ – తొగుట : తొగుట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ నవీన్ బుధవారం తుక్కాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైకి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మా నించి నూతన బాధ్యతలకు చేపట్టిన ఎస్ఐకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామంలో_ శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ముందుంటుందని అన్నారు. గ్రామ అభివృద్ధి కి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని గ్రామ ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిక్కుడు (మాష్టి) కళావతి స్వామి ముది రాజ్, ఉప సర్పంచ్ బోయిని కవిత బాలరాజ్ ముదిరాజ్, వార్డు సభ్యులు బోయిని పద్మ లక్ష్మణ్ ముదిరాజ్, గొడుగు శ్రీశైలం ముదిరాజ్, చిక్కుడు సాయిరాజ్ ముదిరాజ్, లింగాల మహేష్, సింధు మహేష్, గోపని రమేష్ ముదిరాజ్, కో-ఆప్షన్ సభ్యులు మౌలానా గోరిమియా తదితరులు పాల్గొన్నారు.
ఎస్సైని సన్మానించిన తుక్కాపూర్ గ్రామ పాలకవర్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



