Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ

సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ

- Advertisement -

ప్రజాప్రతినిధులతో సీఎం భేటీ
కనిపించని మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్‌ 7‌ నుంచి జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌‌ను అసెంబ్లీ ప్రారంభమయ్యాక బీఏసీలో నిర్ణయిస్తారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన సీఎం రేవంత్‌‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌‌లో ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలపై అసెంబ్లీ , శాసనమండలి కార్యదర్శులకు సమాచారం ఇచ్చారు. నీటిపారుదల పెండింగ్‌ ప్రాజెక్టులు, భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌, ఫారెస్టు అనుమతులు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అయితే మంత్రి కొండా సురేఖ సీఎంను కలవలేదు. సచివాలయంలో మంత్రివర్గంతో కలిసి సీఎం నిర్వహించిన మీడియా సమావేశానికి కూడా ఆమె హాజరుకాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -