Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ లబ్ధిదారులకు కలెక్టర్ కానుక

ఇందిరమ్మ లబ్ధిదారులకు కలెక్టర్ కానుక

- Advertisement -

– గోడ గడియారాల పంపిణీ 
నవతెలంగాణ-నసురుల్లాబాద్ : నసురుల్లాబాద్ మండలంలోని బొప్పాసుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశాల మేరకు బుదవారం గోడ గడియారాలను పంపిణీ చేశారు. గ్రామానికి మొత్తం 70 ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకాగా, ప్రస్తుతం అన్ని ఇండ్లు పూర్తి దశలో ఉన్నాయి. వీటిలో 12 ఇండ్ల నిర్మాణం పూర్తికావడంతో ఆయా లబ్ధిదారులకు గోడ గడియారాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మీ బాయి మాట్లాడుతూ గ్రామంలోని అత్యంత నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్ల మంజూరుకు సహకరించిన జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎంపీడీఓ రవీశ్వర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి మరింత సహకారం అందించాలని కోరిన ఆమె, ప్రతి ఇంటికి కొబ్బరి, మామిడి మొక్కల పెంపకానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులను అభినందిస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సుధాకర్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బొప్పాసుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తి కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -