నవతెలంగాణ-హైదరాబాద్ : జావా 42 ఐవరీని ఇటీవల ప్రారంభించిన నాటి నుండి రైడర్స్ అత్యంత ఆసక్తి కనబరిచారు. ఇప్పుడు ఇది on Amazon.in మరియు ఫ్లిప్ కార్ట్ లలో బుక్కింగ్ కోసం లభిస్తోంది. భారతదేశంలో ప్రముఖ ఇ-కామర్స్ వేదికలకు మోటార్ సైకిల్ ను తీసుకురావడం ద్వారా ఆన్ లైన్ లో తమ యాజమాన్య ప్రయాణాన్ని కనుగొని మరియు ఆరంభించడానికి దేశవ్యాప్తంగా ఔత్సాహికులకు జావా సులభతరం చేసింది.
ప్రారంభపు యజమానులలో చాలామంది కోసం, ఐవరీ ఎడిషన్ తక్షణమే ఆకర్షించింది మరియు ఎంతో వ్యక్తిగతమైన భావన కలిగించింది.
పూణె, మహారాష్ట్రకు చెందిన శైలేంద్ర ఎస్ నానేకర్ ఇటీవల కమ్యూటర్ మోటార్ సైకిల్ నుండి ఐవరీకి మారినప్పుడు తన అనుభవాన్ని వర్ణించారు: “పవర్ లో పెరుగుదలను తక్షణమే గుర్తించవచ్చు. ఎక్కువ దూరాలకు, విశ్రాంతదాయకమైన రైడ్స్ కోసం ఇది ఉత్తమమైన మరియు సౌకర్యవంతమైన భావన కలిగించింది. ”
అందరి దృష్టిని ఆకర్షించే సామర్థ్యం, సంభాషణలు ఆరంభించేలా చేయడం, ఇంకా కొంతమందికి గతం గుర్తుకు వచ్చేలా చేయడం వంటి మోటార్ సైకిల్ కు గల సామర్థ్యం అతనికి ప్రత్యేకంగా అనిపించింది. “నేను ఎక్కడ పార్క్ చేసినా, ప్రజలు వచ్చి ఐవరీని చాలా దగ్గర నుండి పరిశీలించేవారు. జావా 42 ఐవరీ తమకు జావా యొక్క తొలి రోజుల్ని గుర్తు చేస్తోందని అన్నారు. ఐవరీని ఆరాధించడానికి వారు తన వాహనం వద్ద ఆగి దాని ట్యాంకును చేతితో తాకేవారని, వాహనంపై కూర్చుని మరియు మోటార్ సైకిల్ గురించి అడిగేవారని అతను చెప్పాడు. ”
ఐవరీ ఎడిషన్ జావా 42 యొక్క డిజైన్ వారసత్వంపై రూపొందింది, ఇది భారతదేశంలో ఆధునిక నియో-క్లాసిక్ మోటార్ సైకిల్ విభాగాన్ని రూపొందించడంలో సహాయపడింది. దీని సున్నితమైన లేత రంగు, క్లాసిక్ నిష్పత్తులు మరియు నిరాడంబరమైన స్టైలింగ్ లు క్లాసిక్ మోటార్ సైక్లింగ్ తో ఉన్న మధురానుభూతులను గుర్తు చేస్తూనే సమకాలీన విలక్షణమైన రూపం అందిస్తున్నాయి.
ఈ సరికొత్త ఎడిషన్ తమ విలక్షణమైన రెట్రో లైవరీ, సిగ్నేచర్ ‘42’ డీకాల్స్, మరియు ట్యాంకుపై ఉన్న చదరంగం జెండా గుర్తు, మోటార్ సైకిల్ యొక్క విలక్షణమైన వ్యక్తిత్వం మరియు రేసింగ్ ను ప్రేరేపించే వారసత్వాన్ని మరింత బలపరిచే వివరాలతో ఈ డిజైన్ సిద్ధాంతాన్ని కొనసాగించింది.
ఈ అంశాలు అన్నీ రోజూవారీ జీవితంలో ఎలా ఒక చోట చేరుతాయో జావా 42 ఐవరీని ఇటీవల కొనుగోలు చేసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన హరి వివరించారు: “ఐవరీ రంగు తక్షణమే నాకు అనుకూలంగా ఉంది. పండగ సందర్భాల్లో నేను సంప్రదాయబద్ధమైన రూపంలో దుస్తులు ధరించినప్పుడు, మోటార్ సైకిల్ నా పూర్తి రూపానికి సరిపోతుంది. సున్నితమైన లేత రంగు బంగారు లేదా క్రీమ్, మెరూన్ వంటి రంగులతో అందంగా కలిసిపోతుంది. ఇది నాకు అత్యంత క్లాసిక్ భావన క్షణాన్ని ఇస్తుంది. ”
కొంతమంది రైడర్స్ కు, వారు మోటార్ సైకిల్ ను మొదటిసారి చూసిన క్షణమే వారికి దానితో ఉన్న సంబంధం ఆరంభమవుతుంది.
పుదుచ్చేరికి చెందిన ప్రేమ్ కుమార్ తన మొదటి అభిప్రాయాన్ని ఇలా గుర్తు చేసుకున్నారు: “నేను షోరూంలో చూసిన వెంటనే ఐవరీ రంగు నాకు ఎంతో నచ్చింది. అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా చేసే శాశ్వతమైన నాణ్యతను కలిగి ఉంది .”
జావా 42 ఐవరీ ఇంజనీరింగ్ శ్రేష్టతను రోజూవారీ వాడకంతో కలిపింది. ఇది శక్తివంతమైన లిక్విడ్-కూల్డ్ జే-పాంథర్ ఇంజన్ ను సున్నితమైన 6-స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడింది, ఇది నిమగ్నమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తోంది. ఇతర 350 సిసి మోటార్ సైకిల్స్ కంటే 40 శాతం వరకు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇంజన్ బలమైన యాక్సిలరేషన్ ను మరియు సులభంగా రైడ్ చేయగలిగే సదుపాయం అందిస్తుంది, ఎక్కువ దూరాల కోసం మరియు నగరంలో ప్రయాణించడానికి అనుకూలమైనది. అనుకూలమైన గేరింగ్ మరియు త్రాటిల్ మ్యాపింగ్ లు రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి, అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ ఉత్సాహవంతమైన రైడింగ్ సమయంలో నియంత్రణను మెరుగుపరుస్తాయి. మోటార్ సైకిల్ కు శ్రేణిలోనే ఉత్తమమైన బ్రేకింగ్ మరియు నిర్వహణ ప్రయోజనాలు ఉన్నాయి, ప్రత్యేకించి భారతదేశపు రహదారుల కోసం తయారు చేయబడింది.
2026 జావా 42 ఐవరీ రూ.1,84,950 ధరకి లభిస్తోంది ( ఎక్స్-షోరూం న్యూఢిల్లీ). మోటార్ సైకిల్ ను 8 నగరాల్లో ఆన్ లైన్ లో బుక్కింగ్ చేయవచ్చు, 130 డీలర్ షిప్స్ ఇ-కామర్స్ సందేహాలకు సేవలు అందిస్తున్నాయి.
Amazon.in మరియు ఫ్లిప్ కార్ట్ లో దీని పరిచయంతో, రైడర్స్ ఇప్పుడు వాహనాన్ని చూడటం నుండి బుక్కింగ్ వరకు కేవలం కొన్ని క్లిక్స్ తో పూర్తి చేయవచ్చు. ప్లాట్ ఫాంలో రిజర్వేషన్ చేసిన తరువాత, సమీపంలో ఉన్న అథీకృత డీలర్ తక్కిన ఆవశ్యకతలను పూర్తి చేయడానికి కస్టమర్ ను సంప్రదిస్తారు మరియు మోటార్ సైకిల్ ను డెలివరీ చేస్తారు.
ఔత్సాహికులలో ఐవరీ ఎడిషన్ గురించి సంభాషణలు పెరగడం కొనసాగుతున్న నేపధ్యంలో, Amazon.in మరియు ఫ్లిప్ కార్ట్ లలో వాహనం లభిస్తుండటం జావా 42ని సొంతం చేసుకోవడం ఇప్పుడు సులభం మరియు ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా మరింత అందుబాటులోకి తెచ్చింది.


