- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీహార్‌లోని సుపాల్ జిల్లా పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. NH-327E పై బజరంగబలి ఆలయం వద్ద రోడ్డు పక్కన కూర్చుని కీర్తనలు పాడుకుంటున్న వారిపైకి అతివేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదానికి గురైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని, వేగం, అదుపు తప్పడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



