Monday, February 23, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

ఎరిక: కళింగ సాహిత్య పాఠశాల’ మూడవ సమావేశం
‘ఎరిక: కళింగ సాహిత్య పాఠశాల’ మూడవ సమావేశం మార్చి 2న విజయనగరం జిల్లా వేణుగోపాలపురంలో ఉన్న జిల్లావిద్యాశిక్షణాకేంద్రంలో జరుగుతుంది. ఈ సభలో చందనపల్లి గోపాలరావు, దత్తి అప్పలనాయుడు, ఎం.రమేష్‌, ఎం. మురళి, వి. చిన్నంనాయుడు, డి.శ్రీనివాసరావు, కె. అప్పారావు, జి.సూరిబాబు, సిహెచ్‌. సోమయాజులు తదితరులు పాల్గొంటారు. – బాలసుధాకర్‌

డా|| మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కార ప్రదాన సభ
తెలంగాణ భాషా, సాంస్కతిక శాఖ సౌజన్యంతో డా|| మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కార ప్రదాన సభ ఈ నెల 25 సాయంత్రం 5.30 గం.లకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. శ్రీ కటుకోజ్వల ఆనందాచారి (గస్సాల్‌ -2025), శ్రీమతి పి. జ్యోతి (ఉలిపి కట్టెలు’ -2026) ఎంపికయ్యారు. ఈ సభలో డా|| నాళేశ్వరం శంకరం, డా|| నందిని సిద్ధారెడ్డి, డా|| ఏనుగు నరసింహా రెడ్డి, సమ్మెట ఉమాదేవి, శ్రీమతి రూప రుక్మిణీ, శ్రీమతి శీలా సుభద్రాదేవి, మాడభూషి లలిత తదితరులు పాల్గొంటారు. వివరాలకు : 9440444019

కొలకలూరి పురస్కారాల ప్రదానం
కొలకలూరి పురస్కారాల ప్రదానం, పరిశోధక సన్మానం ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు శ్రీ యన్‌.టి.ఆర్‌. కళాప్రాంగణం, యస్‌.పి. తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి జరుగుతుంది. ఈ సభలో ఆచార్య యం. కుమార్‌, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఆచార్య కట్టమంచి ఆశాజ్యోతి, ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఆచార్య చిలుమూరి శ్రీనివాసరావు, ఆచార్య కొలకలూరి సుమకిరణ్‌ పాల్గొంటారు. కొలకలూరి అనితా శ్రీకిరణ్‌

‘అహానికి ఆవల’ పరిచయ సభ
జి. ఉమామహేశ్వర్‌ రచించిన కథల సంపుటి – అహానికి ఆవల – పరిచయ సభ 1 ఫిబ్రవరి 2026 ఆదివారం ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. సభకు దాసరి అమరేంద్ర అధ్యక్షత వహిస్తారు. కె.పి. అశోక్‌ కుమార్‌, మారుతి పౌరోహితం, శ్రీఊహ వక్తలుగా పాల్గొంటారు. – పాలపిట్ట బుక్స్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -