- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెనెజువెలా దేశంలో భారీ భూకంపం సంభవించింది. రాజధాని కరాకస్ సమీపంలో కేవలం 39 సెకన్ల వ్యవధిలో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించడంతో బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయి ఉండొచ్చని, దాంతో భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంది. మృతుల సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చు’’ అని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రస్తుతానికి వెనెజువెలా ప్రభుత్వం మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
- Advertisement -


